ఒంగోలులో వైసీపీకి భారీ షాక్.. జనసేనలో చేరుతున్న 20 మంది వైసీపీ కార్పొరేటర్లు

20 Ongole YSRCP corporators to join Janasena
గత ఎన్నికల్లో ఓటమిపాలైన తర్వాత వైసీపీకి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలు మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు వైసీపీ చేజారాయి. తాజాగా ఒంగోలులో వైసీపీకి మరో భారీ షాక్ తగలబోతోంది. 20 మంది వైసీపీ కార్పొరేటర్లతో పాటు ముగ్గురు కో-ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరబోతున్నారు. ఈ రోజు సాయంత్రం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో వీరంతా జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు.  

వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరేందుకు కొన్ని రోజులుగా ప్రయత్నాలు కొనసాగుతున్నప్పటికీ... పవన్ అందుబాటులో లేకపోవడంతో ఈ కార్యక్రమం పలుమార్లు వాయిదా పడింది. బాలినేని వైసీపీలో ఉన్న సమయంలో వీరంతా ఆయన ఆశీస్సులతో కార్పొరేటర్లుగా గెలిచారు. బాలినేని వైసీపీని వీడి జనసేనలో చేరడంతో... వీరంతా కూడా ఆయన వెంటే నడుస్తామని చెప్పి, జనసేనలో చేరుతున్నారు. ఈ 23 మంది సభ్యులు కూడా జనసేనలో చేరితే మొత్తం ఒంగోలు రాజకీయమే మారిపోతుందని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు.
Go Back to Shorts
Ongole YSRCP
Corporators
Pawan Kalyan
Balineni Srinivasa Reddy
Janasena

More Telugu News