విడాకుల వైపు మరో బాలీవుడ్ సీనియర్ జంట.. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారంటూ కథనాలు!
- నటుడు గోవింద, ఆయన భార్య సునీతా అహుజా విడిపోనున్నట్లు బాలీవుడ్ మీడియాలో కథనాలు
- ఈ జంట చాలా కాలంగా విడివిడిగా నివసిస్తున్నారన్న 'జూమ్ టీవీ'
- ప్రస్తుతం గోవిందకు ఓ మరాఠీ నటితో రిలేషన్!
- ఈ నేపథ్యంలోనే ఈ జంట విడాకుల వైపు ఆలోచిస్తున్నట్లు 'బాలీవుడ్ నౌ' కథనం
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవింద, ఆయన భార్య సునీతా అహుజా విడిపోనున్నట్లు తెలుస్తోంది. 37 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలకబోతున్నారంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ జంట చాలా కాలంగా విడివిడిగా నివసిస్తున్నారని 'జూమ్ టీవీ' పేర్కొంది.
గోవింద, సునీతా అహుజాల విభిన్న జీవనశైలి వారి మధ్య దూరాన్ని పెంచిందని కథనాలు చెబుతున్నాయి. అలాగే గోవింద ప్రస్తుతం ఓ మరాఠీ నటితో రిలేషన్‌లో ఉన్నట్లు, ఈ నేపథ్యంలోనే ఈ జంట విడాకుల వైపు ఆలోచిస్తున్నట్లు 'బాలీవుడ్ నౌ' తెలిపింది.
ఇక ఇటీవల 'హిందీ రష్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సునీతా అహుజా వారి పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలు వెల్లడించారు. తమకు రెండు ఇళ్లు ఉన్నాయని ఆమె తెలిపారు. గోవింద తరచుగా తన బంగ్లాలో నివసిస్తూ ఉంటారని చెప్పారు. ఎందుకంటే ఆయన పలువురితో తరచు సమావేశాలు నిర్వహిస్తుంటారని, ఆ భేటీల తర్వాత ఆలస్యంగా ఇంటికి వస్తుంటారని ఆమె వెల్లడించారు. అందుకే తాను ఇద్దరు పిల్లలతో కలిసి వేరుగా ఫ్లాట్ లో ఉంటున్నట్లు చెప్పారు.
కాగా, గోవింద, సునీతా అహుజా 1987 మార్చిలో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 1988లో కుమార్తె టీనా, 1997లో యశ్వర్ధన్ అనే కుమారుడు జన్మించాడు.