వారెవ్వా.. 43 ఏళ్ల వ‌య‌సులోనూ మెరుపు ఫీల్డింగ్‌.. యువ‌రాజ్ స్టన్నింగ్ క్యాచ్ వీడియో!

  • ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్‌లో ఇండియా మాస్ట‌ర్స్, శ్రీలంక మాస్ట‌ర్స్ మ్యాచ్‌
  • 43 ఏళ్ల వ‌య‌సులోనూ అద్భుత‌మైన క్యాచ్ తో అంద‌రినీ స్ట‌న్ చేసిన యువీ
  • నెట్టింట వైర‌ల్ అవుతున్న యువ‌రాజ్ స్ట‌న్నింగ్‌ క్యాచ్ వీడియో 
  • ఈ మ్యాచ్‌లో శ్రీలంక‌ను 4 ర‌న్స్ తేడాతో మట్టిక‌రిపించిన ఇండియా
ఇంట‌ర్నేష‌న‌ల్ మాస్ట‌ర్స్ లీగ్‌లో టీమిండియా మాజీ క్రికెట‌ర్ యువ‌రాజ్ సింగ్ స్ట‌న్నింగ్ క్యాచ్‌తో అల‌రించాడు. ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో శ్రీలంక మాస్ట‌ర్స్ జ‌ట్టు ఆట‌గాడు లహిరు తిరిమన్నే కొట్టిన బంతిని బౌండ‌రీ లైన్ వ‌ద్ద గాల్లోకి ఎగిరి ఒడిసిప‌ట్టుకున్నాడు. 43 ఏళ్ల వ‌య‌సులోనూ అప్ప‌టి యువ‌రాజ్‌ను గుర్తు చేశాడు. దీంతో యువీ క్యాచ్ వీడియో ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

అటు బ్యాటింగ్‌లోనూ అద‌ర‌గొట్టిన యువీ 22 బంతుల్లో 2 సిక్స‌ర్లు, 2 బౌండ‌రీల‌తో అజేయంగా 31 ప‌రుగులు బాదాడు. అత‌నితో పాటు గుకీరత్ సింగ్ (44), స్టూవర్ట్ బిన్నీ (68), యూసుఫ్ పఠాన్ (56 నాటౌట్) రాణించ‌డంతో ఇండియా మాస్ట‌ర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 222/4 పరుగులు చేసింది. 

అనంత‌రం 223 ప‌రుగుల ల‌క్ష్య‌ ఛేద‌న‌తో బ‌రిలోకి దిగిన శ్రీలంక మాస్ట‌ర్స్ 218 ర‌న్స్ చేసింది. దీంతో నాలుగు ప‌రుగుల తేడాతో ప‌రాజ‌యం పాలైంది. ఆ జ‌ట్టులో కుమార్ సంగక్కర 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇర్ఫాన్ పఠాన్ మూడు వికెట్లు తీసి ఇండియా మాస్ట‌ర్స్  విజ‌యంలో కీరోల్ పోషించాడు. 


More Telugu News