కుటుంబంతో కలిసి కుంభమేళాకు హాజరైన తమన్నా

Tamannah attends Maha Kumbh along with family members
మిల్కీ బ్యూటీ తమన్నా ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగరాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాకు హాజరైంది. తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు విచ్చేసిన తమన్నా... త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించింది. ఈ సందర్భంగా తమన్నా కుటుంబ సభ్యులు సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. 

కాగా, యూపీ ప్రభుత్వం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్న కుంభమేళాకు ఇప్పటివరకు 60 కోట్ల మంది భక్తులు హాజరైనట్టు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఈ నెల 26తో కుంభమేళా ముగియనుండడంతో... దేశవిదేశాల నుంచి వస్తున్న భక్తులతో రద్దీ మరింత పెరిగింది.
Go Back to Shorts
Tamannaah
Maha Kumbh
Prauagraj
Uttar Pradesh

More Telugu News