Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఇంట్రెస్టింగ్ మ్యాచ్... టాస్ గెలిచిన ఆసీస్

Aussies won the toss and elected bowling first
షార్ట్స్‌లో చూడండి
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో నేడు ఆసక్తికర మ్యాచ్ జరుగుతోంది. చిరకాల ప్రత్యర్థులు అనదగ్గ ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు గ్రూప్-బి మ్యాచ్ లో అమీతుమీ తేల్చుకునేందుకు బరిలో దిగాయి. లాహోర్ లోని గడాఫీ స్టేడియంలో ఈ పోరు జరుగుతోంది. టాస్ గెలిచిన ఆసీస్ బౌలింగ్ ఎంచుకుంది. 

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు 12 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల నష్టానికి 87 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ 10, వన్ డౌన్ బ్యాట్స్ మన్ జేమీ స్మిత్ 15 పరుగులు చేసి అవుటయ్యారు. ఈ రెండు వికెట్లు డ్వార్షూయిస్ కు దక్కాయి. 

ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ బెన్ డకెట్ (27 బ్యాటింగ్), జో రూట్ (22 బ్యాటింగ్) ఉన్నారు.
Go Back to Shorts
Champions Trophy 2025
Australia
England
Lahore

More Telugu News