డ్రెస్సింగ్ రూమ్‌లో బోరున ఏడ్చేసిన ఫ‌ఖర్ జ‌మాన్‌.. ఇదిగో వీడియో!

 Fakhar Zaman Crying Inside Pakistan Dressing Room
  • ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీకి పాకిస్థాన్‌ ఆతిథ్యం
  • ఓపెనింగ్ మ్యాచ్‌లోనే పాక్‌కు ఊహించ‌ని షాక్‌
  • ఒక‌వైపు ఓట‌మి.. మ‌రోవైపు స్టార్ ప్లేయ‌ర్ ఫ‌ఖ‌ర్ జ‌మాన్‌కు గాయం
  • గాయంతోనే బ్యాటింగ్‌కి దిగిన ఫ‌ఖ‌ర్‌ 
ప్ర‌స్తుతం జరుగుతున్న ఛాంపియ‌న్స్ ట్రోఫీ ద్వారా దాదాపు 29 ఏళ్ల త‌ర్వాత ఓ ఐసీసీ మెగా ఈవెంట్‌కు పాకిస్థాన్ ఆతిథ్యమిస్తోంది. దాంతో ఈ ఐసీసీ ఈవెంట్ నిర్వ‌హ‌ణ‌కు భారీగానే ఏర్పాట్లు చేసింది. అయితే, ఆతిథ్య దేశానికి ఓపెనింగ్ మ్యాచ్‌లోనే భారీ షాక్ త‌గిలింది. న్యూజిలాండ్‌తో ఆడిన తొలి మ్యాచ్‌లోనే పాక్ జ‌ట్టు ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. దీంతో అభిమానులు త‌మ జ‌ట్టు ఆట‌గాళ్ల‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. 

ఇదిలాఉంటే... కివీస్‌తో మ్యాచ్‌లో తొలి ఓవ‌ర్‌లోనే పాక్ స్టార్ ఆట‌గాడు ఫ‌ఖ‌ర్ జ‌మాన్ ఫీల్డింగ్ చేస్తూ గాప‌డ్డ విష‌యం తెలిసిందే. దాంతో వెంట‌నే మైదానం వీడాడు. అత‌డి స్థానంలో క‌మ్రాన్ గులామ్ స‌బ్‌స్టిట్యూట్ ఫీల్డ‌ర్‌గా గ్రౌండ్‌లోకి దిగాడు. ఫ‌ఖర్ తొడ‌ కండ‌రాలు ప‌ట్టేయ‌డంతో ఇబ్బంది ప‌డ్డాడు.

ఆ త‌ర్వాత బ్యాటింగ్ స‌మ‌యంలో ఓపెన‌ర్‌గా కాకుండా నాలుగో స్థానంలో బ‌రిలోకి దిగాడు. 41 బంతుల్లో 24 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ చేరాడు. డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లే క్ర‌మంలో మెట్లు ఎక్కే స‌మ‌యంలో కూడా అత‌డు ఇబ్బంది ప‌డ‌టం క‌నిపించింది. ఇక డ్రెస్సింగ్ రూమ్‌లోకి వెళ్లిన త‌ర్వాత ఫ‌ఖ‌ర్ కుర్చీలో కూర్చొని బోరున ఏడ్చేశాడు. 

అక్క‌డే ఉన్న తోటి ఆట‌గాడు షాహీన్ అఫ్రిదీ, అసిస్టెంట్ కోచ్ అత‌డిని ఓదార్చ‌డం క‌నిపించింది. ప్ర‌స్తుతం ఫ‌ఖ‌ర్ బోరున ఏడ్చిన‌ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. దీనిపై నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో స్పందిస్తున్నారు.   
Go Back to Shorts
Fakhar Zaman
Crying
Dressing Room
Pakistan
Cricket
Champions Trophy 2025
Sports News

More Telugu News