ముఖ్యమంత్రిని అవమానించారంటూ కేసు నమోదు... హైకోర్టులో కేటీఆర్ పిటిషన్
- రేవంత్ రెడ్డిపై ఆరోపణలు చేశారని కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు
- కేటీఆర్‌పై కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ పోలీసులు
- బాణసంచా కాల్చారంటూ ముషీరాబాద్‌లో మరో కేసు
- కేసులు కొట్టివేయాలంటూ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేసిన కేటీఆర్
బిల్డర్లు, కాంట్రాక్టర్ల వద్ద ముఖ్యమంత్రి రూ.2,500 కోట్లు తీసుకున్నట్లు కేటీఆర్ ఆరోపణలు చేశారని కాంగ్రెస్ కార్యకర్త ఫిర్యాదు చేశారు.
ఎన్నికల ప్రచారంలో బాణసంచా కాల్చినందుకు ముషీరాబాద్ పోలీస్ స్టేషన్లో కేటీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌పై పోలీసులు మరో కేసు నమోదు చేశారు.
ఈ రెండు కేసులను కొట్టివేయాలని కేటీఆర్ హైకోర్టులో రెండు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేశారు. ఎలాంటి కారణాలు లేకుండా పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్లో పేర్కొన్నారు. హైకోర్టు ఈ పిటిషన్లపై తదుపరి విచారణను మార్చి 18వ తేదీకి వాయిదా వేసింది.