ఆప్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు బిగ్ షాక్

  • మనీలాండరింగ్ కేసులో విచారణకు రాష్ట్రపతి ఆమోదం
  • ప్రాసిక్యూషన్‌కు అనుమతి కోరిన హోంమంత్రిత్వ శాఖ
  • కోర్టులో అదనపు అభియోగ పత్రాన్ని దాఖలు చేయనున్న ఈడీ
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ కు బిగ్ షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆయనకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. మనీలాండరింగ్ కేసులో ఆయనపై విచారణ జరిపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం నాడు అనుమతించారు. 

సత్యేంద్ర జైన్ ప్రాసిక్యూషన్‌కు అనుమతించాలని ఇటీవల హోంమంత్రిత్వ శాఖ రాష్ట్రపతిని కోరింది. రాష్ట్రపతి అనుమతి లభించిన నేపథ్యంలో ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈడీ తాజాగా అదనపు అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించనుంది. హవాలా ఒప్పందాల ఆరోపణలతో ఈడీ 2022లో సత్యేంద్ర జైన్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేసి, అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన బెయిల్‌పై ఉన్నారు. 


More Telugu News