ఒక్కో ఉద్యోగికి రూ.4 లక్షలు... అదిరిపోయే బోనస్ ప్రకటించిన ఫ్రెంచ్ కంపెనీ

  • వరల్డ్ ఫ్యాషన్ లగ్జరీ బ్రాండ్ గా హెర్మ్స్ కంపెనీ
  • గతేడాది భారీగా పెరిగిన హెర్మ్స్ కంపెనీ సంపద
  • ఉద్యోగులకు బోనస్ ప్రకటన
కొన్ని సంస్థలు లాభాలు వచ్చినప్పుడు ఉద్యోగులకు బోనస్ ఇస్తుంటాయి... మరి కొన్ని సంస్థలు ఉద్యోగులను మరింత ప్రోత్సహించేందుకు కూడా బోనస్ ఇస్తుంటాయి. 

తాజాగా, వరల్డ్ ఫ్యాషన్ క్యాపిటల్ పారిస్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే హెర్మ్స్ సంస్థ తన ఉద్యోగులకు అందించిన బోనస్ గురించి వింటే వావ్ అంటారు. హెర్మ్స్ ప్రముఖ లగ్జరీ, లైఫ్ స్టయిల్ ఉపకరణాల సంస్థ. ఈ సంస్థ ప్రొడక్ట్స్ కు వరల్డ్ వైడ్ బ్రాండ్ ఇమేజ్ ఉంది. 

గతేడాది ఈ సంస్థ ఏకీకృత ఆదాయం రూ.1.36 లక్షల కోట్లు. దాంతో, ఆనందందో పొంగిపోతున్న కంపెనీ యాజమాన్యం లాభాలను ఉద్యోగులకు పంచాలని నిర్ణయించింది. ఒక్కొక్కరికి రూ.4 లక్షల బోనస్ ప్రకటించి, ఉద్యోగులను సంతోషంలో ముంచెత్తింది. ప్రకటించిన బోనస్ ను ఈ ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో చెల్లించనుంది. 

హెర్మ్స్ సంస్థకు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ కంపెనీ 1837 నుంచి కార్యకలాపాలు సాగిస్తోంది.


More Telugu News