మైసూరులో క‌ల‌క‌లం.. ఒకే ఇంట్లో విగ‌త‌జీవులుగా న‌లుగురు కుటుంబ స‌భ్యులు!

17-02-2025 Mon 12:09 | National
Advertisement
  • ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతి
  • ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా వారు బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం
  • మృతులు చేత‌న్, అత‌ని భార్య రూపాలి, కుమారుడు కుశాల్, త‌ల్లి ప్రియంవ‌దగా గుర్తింపు
Advertisement
క‌ర్ణాట‌క రాష్ట్రంలోని మైసూరులో ఒకే ఇంట్లో న‌లుగురు కుటుంబ స‌భ్యులు విగ‌త‌జీవులుగా క‌నిపించ‌డం క‌ల‌క‌లం రేపింది. ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందారు. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఓ కుటుంబం ఇలా బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ట్లు స‌మాచారం. 

పూర్తి వివ‌రాల్లోకి వెళితే.. విశ్వేశ్వ‌ర‌య్య న‌గ‌ర్ లోని సంక‌ల్ప్ సెరీన్ అపార్ట్‌మెంట్ లో నివాస‌ముండే వ్యాపారి చేత‌న్ (45), అత‌ని భార్య రూపాలి (43), కుమారుడు కుశాల్ (15), చేత‌న్‌ త‌ల్లి ప్రియంవ‌ద (65) అప్పుల వారి బాధ భ‌రించ‌లేక బ‌ల‌వంతంగా త‌నువు చాలించారు. భార్య‌, కుమారుడు, త‌ల్లికి విషం ఇచ్చి చంపిన త‌ర్వాత చేత‌న్ ఉరి వేసుకుని ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. 

అయితే, బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి ముందు చేత‌న్ అమెరికాలో ఉండే త‌న సోద‌రుడికి ఫోన్ చేసి, తాము ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్న‌ట్లు చెప్పి, ఫోన్ క‌ట్ చేశాడ‌ని పోలీసులు తెలిపారు. దాంతో అత‌ని సోద‌రుడు ప‌లుమార్లు తిరిగి కాల్ చేశాడు. కానీ, ఎలాంటి స్పంద‌న రాలేదు. దాంతో స్థానికంగా నివాసం ఉంటున్న బంధువుల‌కు ఫోన్ చేసి విష‌యం చెప్పాడు. 

అత‌ని స‌మాచారంతో చేత‌న్ నివాసానికి వచ్చిన బంధువులు.. న‌లుగురు విగ‌త‌జీవులుగా ప‌డి ఉండ‌డం చూసి బోరున విల‌పించారు. అనంతరం పోలీసుల‌కు స‌మాచారం అందించారు. 

అయితే, చేత‌న్ ఫ్యామిలీ గ‌త 10 ఏళ్లుగా సంక‌ల్ప్ సెరీన్ అపార్ట్‌మెంట్ లో నివాస‌ముంటోందని, ఎప్పుడూ ఆర్థిక స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌ట్లు క‌నిపించ‌లేద‌ని స్థానికులు పోలీసుల‌కు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 
Advertisement
MysuruFamilySuicideKarnataka

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more