జగన్ ఆదేశం మేరకు రంగరాజన్‌ను పరామర్శించిన చెవిరెడ్డి

  • ఇటీవల చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకుడు రంగరాజన్‌పై దాడి
  • రంగరాజన్‌ను పరామర్శించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి 
  • రంగరాజన్‌కు జగన్ పూర్తిగా అండగా ఉంటారని హామీ 
వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆదివారం చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ను కలిశారు. ఇటీవల ఆయనపై జరిగిన దాడి ఘటనపై పరామర్శించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు రంగరాజన్‌ను కలుసుకున్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన యోగక్షేమాల గురించి విచారించారు. వారికి పార్టీ అండగా ఉంటుందని జగన్ చెప్పినట్లు తెలిపారు.

అలాగే, రంగరాజన్ తండ్రి సౌందరరాజన్‌ను కూడా చెవిరెడ్డి కలిసి, ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనకు ఎంతో సన్నిహితులని సౌందరరాజన్ పేర్కొంటూ వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 


More Telugu News