పండు ముందా.. తొక్క ముందా.. వైరల్‌ వీడియో ఇదిగో!

పండు ముందా.. తొక్క ముందా.. వైరల్‌ వీడియో ఇదిగో!

monkey spitout fruit and ate peel of Orange
  • ఎవరైనా పండు తిని, తొక్కను పడేయడం మామూలే...
  • కానీ పండును పడేసి తొక్కను తినడం ఎక్కడైనా చూశారా?
  • ‘మనకు తెలియనిది ఏదో దీనికి తెలిసి ఉంటుంది’ అంటూ వైరల్‌ గా మారిన అలాంటి ఓ వీడియో ఇది...
ఎవరైనా పండు తిని తొక్క పడేస్తారు. మనుషులైనా, జంతువులైనా అంతే. కానీ ఇక్కడ మాత్రం ఓ చిత్రం కనిపించింది. ఒక రకమైన కోతి నారింజ పండును వలుచుకుని తొక్కను తింటూ, అందులోపలి పండును పడేయడం మొదలుపెట్టింది. అలా ఒకటికాదు.. రెండు, మూడు పండ్లను దగ్గర పెట్టుకుంది. ఒకదాని తర్వాత మరొకటిగా నారింజ పండ్ల వలుచుకుని తొక్కలు తింటూ, లోపలి భాగాన్ని పడేయడం మొదలుపెట్టింది.
  • ‘నేచర్‌ ఈజ్‌ అమేజింగ్‌’ పేరిట ఉన్న ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ వీడియో పోస్ట్‌ అయింది. ‘మనకు తెలియనది ఏదో దీనికి తెలిసినట్టు ఉంది’ అంటూ ఈ వీడియోకు క్యాప్షన్‌ పెట్టారు.
  • ఈ వీడియో కొన్ని గంటల్లోనే 3.5 మిలియన్ల వ్యూస్‌, 50 వేలకుపైగా లైకులు సాధించడం గమనార్హం.
  • ‘అసలు దేనినీ వేస్ట్‌ చేసే మాటే లేనట్టుంది’ అని ఒకాయన కామెంట్‌ పెడితే... ‘నారింజ తొక్క రుచే వేరు. నా చిన్నప్పుడు నేను కూడా తినేవాడిని’ అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు.
  • ‘ఈ కోతిని చూసిగానీ ఆరెంజ్‌ తొక్క తినే ప్రయత్నం చేయకండి. ఇప్పుడొచ్చే నారింజ పండ్లన్నీ కెమికల్స్‌, పురుగు మందులు చల్లినవే ఉంటున్నాయి..’ అని ఓ నిపుణుడు సూచించడం గమనార్హం.
Advertisement
offbeat
Viral Videos
orange
monkey
X Corp
Twitter

More Telugu News