పృథ్వీ చేసిన వ్యాఖ్యలు ముమ్మాటికీ తప్పే: నటుడు బ్రహ్మాజీ
- 'లైలా' ప్రీరిలీజ్ ఈవెంట్ లో పృథ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు
- సినిమా వేడుకలో అలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న బ్రహ్మాజీ
- అనవసరంగా బలి అయింది విష్వక్ మాత్రమేనని వ్యాఖ్య
తాజాగా ఈ అంశంపై నటుడు బ్రహ్మాజీ మాట్లాడుతూ... పృథ్వీ చేసిన వ్యాఖ్యలు చాలా తప్పని అన్నారు. ఒక సినిమా వేడుకకు వచ్చినప్పుడు అలా మాట్లాడకూడదని చెప్పారు. ఎన్నికలు అయిపోయాయని... ఇప్పుడు నువ్వు వచ్చి కొత్తగా ఆ విషయాన్ని చెప్పకూడదని అన్నారు. ఈ విషయంలో అనవసరంగా బలి అయింది విష్వక్సేన్ మాత్రమేనని చెప్పారు. పృథ్వీ విషయంలో ఆయనను టార్గెట్ చేసిన వాళ్లంతా కరెక్టేనని అన్నారు.