ఢిల్లీ లిక్కర్ స్కాంతో పోల్చితే ఏపీ లిక్కర్ స్కాం 10 రెట్లు పెద్దది: లోక్ సభలో సీఎం రమేశ్
- లోక్ సభలో జీరో అవర్
- ఏపీ లిక్కర్ స్కాం అంశాన్ని ప్రస్తావించిన ఎంపీ సీఎం రమేశ్
- 2019-24 మధ్య కాలంలో లిక్కర్ పాలసీ మార్చారని ఆరోపణ
ప్రైవేటు దుకాణాలను మద్యం అమ్మకాల బాధ్యతల నుంచి తప్పించి, ఆ బాధ్యతను ప్రభుత్వ దుకాణాలకు అప్పగించారని సీఎం రమేశ్ వివరించారు. ఐదేళ్లలో రూ. లక్ష కోట్లకు పైగా అమ్మకాలు జరిగాయని తెలిపారు.
మొత్తం లావాదేవీలు పూర్తిగా నగదు రూపంలోనే జరిగాయని, ఒక్కటి కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ జరపలేదని అన్నారు. ఉద్యోగులను కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించుకున్నారని తెలిపారు.