జగన్ ఎంతకైనా తెగిస్తారు... జాగ్రత్త: చంద్రబాబు
- తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారంలో కొందరిని అరెస్ట్ చేసిన సీబీఐ
- కల్తీ నెయ్యి గురించి మనం మాట్లాడితే జగన్ తప్పుబట్టారన్న చంద్రబాబు
- తాను చెప్పిందే నిజమని నిరూపించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్య
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ... అక్రమాలు బయటపడిన తర్వాత కూడా నెయ్యి సరఫరాలో అక్రమాలు లేవంటూ జగన్ దుష్ప్రచారానికి యత్నించారని అన్నారు. తాను చెప్పిందే నిజమని నిరూపించేందుకు జగన్ ఎంతకైనా తెగిస్తారని... జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు, మంత్రులు అభిప్రాయపడ్డారు. బాబాయ్ హత్యను, కోడికత్తి డ్రామాను, గులకరాయి డ్రామాను కూడా టీడీపీపైకి నెట్టివేసేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. జగన్ నాటకాలపై అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సహా మంత్రులు అభిప్రాయపడ్డారు.