చుట్టమల్లే పాట పాప్ సింగర్ నోట.. వైరల్ గా మారిన వీడియో!
- బెంగళూరు ఈవెంట్ లో పాడిన ఎడ్వర్డ్ క్రిస్టొఫర్ షీరన్
- సంగీతానికి హద్దుల్లేవంటూ జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్య
- మీ నోట ఈ పాట వినడం సంతోషంగా ఉందని వెల్లడి
ఆదివారం జరిగిన ఈవెంట్ లో ‘ఎందుకు పుట్టిందో పుట్టింది’ అంటూ ఆయన తెలుగులో పాడారు. శిల్పారావుతో గొంతు కలిపారు. వీరు పాట పాడుతుండగా ఆడిటోరియం దద్దరిల్లింది. మధ్యలో ప్రేక్షకులు కోరస్ గా 'ఆ' అంటూ అరుస్తూ కేకలు పెట్టారు. బ్రిటీష్ యాసతో షరీన్ నోట చుట్టమల్లే పాట డిఫరెంట్ గా వినిపించింది. కాగా, ఈ వీడియోను చూసి నెటిజన్లు షీరన్ ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. పాప్ సింగర్ నోట తెలుగు పాట వినడంతో ప్రేక్షకులు సంతోషంతో కేకలు వేశారు. ఇదంతా ఆ కాన్సర్ట్ కు హాజరైన వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్ గా మారింది.