Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వాహనశ్రేణిలోని డ్రైవర్ మృతిపై సీఎం చంద్రబాబు సంతాపం

CM Chandrababu Pay Tributes to Convoy Driver Dead
Advertisement
  • సీఎం వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మృతి
  • సీఎం కాన్వాయ్‌లోని వాహనశ్రేణిలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలంగా అమీన్ బాబు విధులు
  • అమీన్ బాబు మృతిప‌ట్ల‌ విచారం వ్యక్తం చేసిన సీఎం చంద్ర‌బాబు
  • అత‌ని కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ
Advertisement
సీఎం చంద్ర‌బాబు వాహనశ్రేణిలో డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తోన్న ఎండీ అమీన్ బాబు గుండెపోటుతో మరణించారు. అమీన్ బాబు మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్‌లోని వాహనశ్రేణిలో డ్రైవర్‌గా సుదీర్ఘకాలంగా అమీన్ బాబు విధులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ తెల్లవారుజామున అమీన్ మృతి చెందారు. 

విషయం తెలుసుకున్న సీఎం చంద్ర‌బాబు.. డ్రైవ‌ర్ అమీన్ బాబు మృతిప‌ట్ల‌ విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ‌జేశారు. ప్రభుత్వ పరంగా అమీన్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని సీఎం చంద్ర‌బాబు హామీ ఇచ్చారు.
Advertisement
Advertisement
Chandrababu
Andhra Pradesh
CM Convoy

More Telugu News