అపచారం... తిరుమల శ్రీవారి ఆలయంపై మరోసారి చక్కర్లు కొట్టిన విమానం
- తరచుగా శ్రీవారి ఆలయం పైనుంచి వెళుతున్న విమానాలు
- ఈరోజు కూడా ఆలయ గోపురం పైనుంచి వెళ్లిన విమానం
- ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు
ఆగమశాస్త్రం ప్రకారం ఆలయం పైనుంచి రాకపోకలు నిషిద్ధం. ఆలయంపై రాకపోకలు సాగిస్తే ఆపదలు సంభవిస్తాయని ఆగమ పండితులు చెపుతున్నారు. మరోవైపు, శ్రీవారి ఆలయంపై విమానాల రాకపోకలపై కేంద్ర ప్రభుత్వానికి టీటీడీ పలుమార్లు ఫిర్యాదు చేసింది. తిరుమల ఆలయంపై విమాన రాకపోకలను నిషేధించాలని, ఆ ప్రాంతాన్ని నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని కోరింది. అయినా కేంద్ర విమానయాన శాఖ పట్టించుకోలేదు.