గిగ్ వర్కర్లకు శుభవార్త చెప్పిన కేంద్ర మంత్రి

  • రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు ప్రకటించిన కేంద్ర మంత్రి
  • మరో 120 రూట్ లలో ఉడాన్ పథకం అమలు
  • గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా
కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు అందజేసే రుణాలపై మంత్రి నిర్మల కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాలకు రూ.1.5 లక్షల కోట్ల రుణాలు అందజేయనున్నట్లు ప్రకటించారు. మూలధన వ్యయాల కోసం 50 ఏళ్లకు వడ్డీ రహిత రుణాలు అందజేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు సంస్కరణలు అమలుచేస్తే ప్రోత్సాహకాలు ప్రకటించనున్నట్లు వెల్లడించారు. 
 
ఉడాన్‌ పథకాన్ని మరిన్ని రూట్లకు విస్తరించాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి నిర్మల బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ఇప్పుడు అమలుచేస్తున్న రూట్లకు అదనంగా మరో 120 రూట్లలో కొత్త ఉడాన్ పథకాన్ని అమలు చేస్తామని తెలిపారు. మొత్తంగా వచ్చే పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణ సదుపాయం కల్పించడమే లక్ష్యమని మంత్రి ప్రకటించారు. అదేవిధంగా బీహార్‌ లో గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
 
ఈ శ్రమ్ పోర్టల్ కింద గిగ్ వర్కర్లను నమోదు చేసి గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. పీఎం జన్ ఆరోగ్య యోజన పథకం కింద గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సదుపాయం కల్పిస్తామని చెప్పారు. ఈ నిర్ణయంతో కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుందని వివరించారు.



More Telugu News