మూడో టీ20 ఇంగ్లండ్ దే... ఛేజింగ్ లో టీమిండియా ఫెయిల్

Team India lost 3rd T20 by 26 runs
ఐదు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో తొలి రెండు టీ20ల్లో విజయం సాధించిన టీమిండియా... మూడో టీ20లో ఓటమిపాలైంది. ఇంగ్లండ్ తో ఇవాళ రాజ్ కోట్ లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా 26 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది. 172 పరుగుల లక్ష్యఛేదనలో ఆతిథ్య జట్టు 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేసింది.

టీమిండియా బ్యాటింగ్ చూస్తే... హార్దిక్ పాండ్యా 40, ఓపెనర్ అభిషేక్ శర్మ 24, తిలక్ వర్మ 18, అక్షర్ పటేల్ 15, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 14, పరుగులు చేశారు. ఓపెనర్ సంజు శాంసన్ 3, వాషింగ్టన్ సుందర్ 6, ధ్రువ్ జురెల్ 2 పరుగులతో నిరాశపరిచారు. ఇంగ్లండ్  బౌలర్లలో జేమీ ఒవెర్టన్ 3, జోఫ్రా ఆర్చర్ 2, బ్రైడన్ కార్స్ 2, మార్క్ ఉడ్ 1, అదిల్ రషీద్ 1 వికెట్ తీశారు. 

ఈ విజయంతో ఇంగ్లండ్ జట్టు సిరీస్ లో టీమిండియా ఆధిక్యాన్ని 2-1కి తగ్గించింది. ఇక ఇరు జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జనవరి 31న పుణేలో జరగనుంది.
Go Back to Shorts
Team India
England
3rd T20I
Rajkot

More Telugu News