'ఐటీ హబ్‌కు ఇంటర్నెట్ కట్' వార్తపై స్పందించిన కేటీఆర్
- ఐటీ హబ్‌కు ఇంటర్నెట్ కట్ అని సాక్షి పత్రికలో కథనం
- దీనిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన కేటీఆర్
- కొత్త కంపెనీల సంగతి దేవుడెరుగు... ఉన్న కంపెనీలు పోకుండా చూడాలన్న కేటీఆర్
దీనిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హైదరాబాద్ నగరం ఒక్కటే కాకుండా తెలంగాణలోని అన్ని ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ రంగాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు ఎనిమిది ఐటీ హబ్‌లను ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ రాగానే... చక్కగా నడుస్తున్న ఆ ఐటీ హబ్‌లు ఒక్కొక్కటిగా పట్టాలు తప్పుతున్నాయని పేర్కొన్నారు. విద్యుత్, ఇంటర్నెట్ బిల్లులు కూడా కట్టని దుస్థితికి చేరుకున్నాయని... ఫలితంగా కంపెనీలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వం మీద కోపంతో ఇలాంటి దుశ్చర్యలు మానుకోవాలని హితవు పలికారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే సదుద్దేశంతో నెలకొల్పిన ఈ ఐటీ హబ్‌లను సక్రమంగా నడపాలని కోరుతున్నానని విజ్ఞప్తి చేశారు.