Team India: తొలి టీ20: ఇంగ్లండ్ ను మోస్తరు స్కోరుకే కట్టడి చేసిన టీమిండియా

Team India restricts England for 132 runs
షార్ట్స్‌లో చూడండి
కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ లో టీమిండియా బౌలర్లు రాణించారు. తొలి టీ20లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లండ్ జట్టు టీమిండియా బౌలర్ల ధాటికి ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 132 పరుగులకు ఆలౌట్ అయింది. 

ఇంగ్లండ్ జట్టులో కెప్టెన్ జోస్ బట్లర్ మినహా మరెవ్వరూ రాణించలేదు. బట్లర్ 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సులతో 68 పరుగులు చేశాడు. యువ సంచలనం హ్యారీ బ్రూక్ 17, జోఫ్రా ఆర్చర్ 12 పరుగులు చేశారు. టీమిండియా బౌలర్లలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి 3, అర్షదీప్ సింగ్ 2, హార్దిక్ పాండ్యా 2, అక్షర్ పటేల్ 2 వికెట్లు తీశారు. 

అనంతరం, 133 పరుగుల లక్ష్యఛేదనకు బరిలో దిగిన టీమిండియా 7 ఓవర్ల అనంతరం 2 వికెట్లకు 67 పరుగులు చేసింది. 26 పరుగులు చేసిన సంజు శాంసన్ తొలి వికెట్ రూపంలో అవుటయ్యాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (0) డకౌట్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు జోఫ్రా అర్చర్ కు దక్కాయి. 

ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ అభిషేక్ శర్మ (29 బ్యాటింగ్), తిలక్ వర్మ (7 బ్యాటింగ్) ఉన్నారు. అభిషేక్ శర్మ 2 ఫోర్లు, 3 సిక్సులు బాది మాంచి ఊపుమీదున్నాడు. టీమిండియా విజయం సాధించాలంటే ఇంకా 78 బంతుల్లో 66 పరుగులు చేయాలి.
Go Back to Shorts
Team India
England
1st T20
Eden Gardens
Kolkata

More Telugu News