గుండెపోటుకు గురైన పద్మారావుగౌడ్‌ను పరామర్శించిన కేటీఆర్
- ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న కేటీఆర్
- కేటీఆర్ వెంట కవిత, తలసాని శ్రీనివాస్ యాదవ్ తదితరులు
- ఉత్తరాఖండ్ పర్యటనలో గుండెపోటుకు గురైన పద్మారావు గౌడ్
పద్మారావు గౌడ్ తన కుటుంబంతో సహా ఉత్తరాఖండ్ పర్యటనలో ఉన్న సమయంలో డెహ్రాడూన్‌లో గుండెపోటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు హుటాహుటిన అక్కడి ఆసుపత్రికి తరలించారు. స్టంట్ వేసిన వైద్యులు ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్పారు. అక్కడ చికిత్స అనంతరం పద్మారావు గౌడ్ హైదరాబాద్ చేరుకున్నారు.