కవిత ఫొటోలు మార్ఫింగ్ చేశారు... చర్యలు తీసుకోండి: తెలంగాణ జాగృతి ఫిర్యాదు
- 'అర్వింద్ అన్న ఆర్మీ' అనే ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఫోటోలు పోస్ట్ చేశారని ఫిర్యాదు
- మార్ఫింగ్ ఫొటోలు పోస్ట్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
- మార్ఫింగ్ ఫొటోలతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం
ఈరోజు మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు, కార్పోరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఫొటోలు మార్ఫింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఒక రాజకీయ పార్టీకి సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.