భారత సరిహద్దుల్లో చైనా సైనిక విన్యాసాలు
- యుద్ధ సన్నద్దతను పరీక్షించిన చైనా మిలటరీ
- సరుకుల రవాణాకు సంబంధించి ప్రయోగాత్మక పరీక్షలు
- లడఖ్ సమీపంలో దాయాది దేశం విన్యాసాలపై భారత బలగాల అప్రమత్తం
చైనా సైనిక విన్యాసాల్లో భాగంగా ఎత్తైన ప్రదేశాలకు లాజిస్టిక్ రవాణా కోసం సైనికులు టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. డ్రోన్లతో సరుకులను, ఆయుధాలను ఎత్తైన ప్రాంతాలకు చేర్చడం, వాహనాలను తరలించడం చేస్తున్నారు. షింజియాంగ్ మిలటరీ కమాండ్‌కు చెందిన రెజిమెంట్ ఈ ప్రాక్టీస్ చేపట్టింది. భారత సరిహద్దుల్లోని లడఖ్ సమీపంలో వాతావరణం అత్యంత చల్లగా ఉంటుంది. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలలో చైనా సైనికులు ప్రాక్టీస్ చేస్తుండడం గమనార్హం. శీతల వాతావరణాన్ని తట్టుకునేందుకు చైనా బలగాలు ఎక్సోస్కెలిటెన్లు ఉపయోగిస్తున్నారు.