రాష్ట్ర ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, లోకేశ్
- భోగి పండుగ కుటుంబానికి కొత్త వెలుగులు తేవాలన్న చంద్రబాబు
- ప్రజాప్రతినిధులుగా అన్ని వేళలా మీతోనే ఉంటామని చంద్రబాబు హామీ
- భోగి మంటలు ప్రజల జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించిన నారా లోకేశ్
మంత్రి నారా లోకేశ్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ .. సంక్రాంతికి ముందు రోజు జరుపుకునే వేడుక భోగి. ఈ భోగి భోగభాగ్యాలతో పాటు మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటున్నానన్నారు. శీతాకాలపు చల్లటి గాలులను చీల్చుతూ వెలిగించే భోగి మంటలు మీ జీవితంలో సరికొత్త కాంతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. భోగి మంటల్లో ఏ విధంగా పాతదనం కాలిపోయిందో .. మీ జీవితంలో కూడా ఆటంకాలన్నీ తొలగిపోయి సకల శుభాలు జరగాలని, మీరు తలపెట్టిన ప్రతి పనిలో విజయం సాధించాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు.