హైదరాబాద్ నుంచి బైక్ లపై సొంతూళ్లకు వెళుతున్న కోస్తాంధ్ర వాసులు

12-01-2025 Sun 14:42 | Both States
Advertisement
  • సంక్రాంతికి సొంతూళ్లకు వెళుతున్న వలసజీవులు
  • ఆర్టీసీ బస్సులు, స్పెషల్ రైళ్లలో కిటకిట
  • ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు
  • కార్లు లేని వాళ్లు కుటుంబాలతో బైక్ పైనే ప్రయాణం 
Advertisement
హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గత రెండ్రోజులతో పోల్చితే వాహనాల రద్దీ ఇవాళ కొంచెం తగ్గింది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన సెంటర్లలో స్వల్పంగా రద్దీ తగ్గుముఖం పట్టింది. చౌటుప్పల్ మండలంలోని పంతంగి టోల్ ప్లాజా వద్ద ఈ మధ్యాహ్నం వాహనాల రద్దీ ఓ మోస్తరుగా ఉంది. 

కాగా, ఆర్టీసీ స్పెషల్ బస్సులు, ప్రత్యేక రైళ్లు  క్రిక్కిరిసిపోయి ఉండడం, ట్రావెల్స్ బస్సుల్లో చార్జీలు మోత మోగుతుండడం, ప్రైవేటు వాహనాలకు అధికంగా చెల్లించాల్సి రావడం, సొంత కార్లు లేకపోవడం వంటి కారణాలతో... కోస్తాంధ్ర వలస జీవులు కుటుంబాలతో సహా బైక్ లపై సొంతూళ్లకు పయనమవుతున్నారు.

హైదరాబాద్-విజయవాడ-కోల్ కతా జాతీయ రహదారులపై బైక్ ప్రయాణాలు పెరిగాయి. ఆయా రహదారులపై కార్ల కంటే బైకులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆ బైకులపై పిల్లాపాపలతో దంపతులు ప్రయాణిస్తున్న దృశ్యాలు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. హైదరాబాదు నుంచి ఏపీకి బైకులపై ప్రయాణించే కొందరిని మీడియా పలకరించగా, తగినన్ని ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో బైకులపై వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. 

కాగా, హైదరాబాద్-విజయవాడ హైవేపై నందిగా-ఐతవరం మధ్య రోడ్డును వెడల్పు చేస్తున్నారు. రోడ్డు పనుల కారణంగా వాహనాలు కిలోమీటర్ల మేర నెమ్మదిగా కదులుతున్నాయి. ప్రయాణానికి ఎక్కువ సమయం పడుతోందని వాహనదారులు అంటున్నారు.
Advertisement
SankrantiBike JourneysHyderabadAndhra PradeshVijayawadaHighway

More Telugu News

సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 'మీసాల బాబు' వీడియో.. ఇది నిజమా, ఫేకా?

25-10-2026 Sun 13:16

ఏపీకి ‘అర్నాబ్’ తుపాను ముప్పు.. యంత్రాంగం ఐదు రోజులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి అనిత

25-10-2026 Sun 12:59

మెరుపు ఇన్నింగ్స్‌తో తిలక్ అద‌ర‌గొట్టాడు.. అత‌నికి ఆ ఫార్మాట్‌లో కూడా అవ‌కాశం ఇవ్వాలి: మాజీ కెప్టెన్ అజారుద్దీన్

25-10-2026 Sun 12:45

సెన్సార్ బోర్డులో భారీ డేటా లీక్.. ఆన్‌లైన్‌లో 500 సినిమాల స్క్రిప్ట్‌లు, కట్ ఆర్డర్లు

25-10-2026 Sun 12:19

సామాన్యుల కృషికి వందనం చేయడమే ‘మన్ కీ బాత్’.. ఇది ఒక తీర్థయాత్ర లాంటిది: 12 ఏళ్ల ప్రస్థానంపై ప్రధాని మోదీ

25-10-2026 Sun 12:06

యుద్ధమా? శాంతా?.. ఇరాన్ విషయంలో ట్రంప్ మాటలతో పెరిగిన ఉత్కంఠ!

25-10-2026 Sun 11:39

టీమిండియాలో ఆడిన ఆనందం నిలవలేదు: మాజీ స్పిన్నర్ ఆవేదన

25-10-2026 Sun 11:24

ఏపీకి అతి తీవ్ర తుపాను ముప్పు.. అప్రమత్తమైన ప్రభుత్వం

25-10-2026 Sun 11:21

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07
..more