సుకుమార్ కూతురు నటించిన 'గాంధీ తాత చెట్టు' ట్రైలర్ వచ్చేసింది!
- 'గాంధీ తాత చెట్టు' ట్రైలర్ విడుదల
- ట్విట్టర్ ఖాతాలో విడుదల చేసిన మహేశ్ బాబు
- హృదయానికి హత్తుకునేలా ఉందంటూ ప్రశంస
ఇక ఈ చిత్రాన్ని ఈ నెల 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. కాగా ఈ చిత్రం ట్రైలర్‌ను గురువారం హీరో మహేశ్ బాబు తన ట్విట్టర్‌లో విడుదల చేశారు. ''ట్రైలర్ చూస్తుంటే ప్రామిసింగ్‌గా, హృదయానికి హత్తుకునే విధంగా ఉంది. సుకృతికి, ఈ సినిమా టీమ్ అందరికి నా అభినందనలు'' అంటూ మహేశ్ బాబు తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
గాంధీ సిద్దాంతాలను అనుసరిస్తూ తమ ఊరిని, తన తాతకు ఇష్టమైన చెట్టును ఓ అమ్మాయి ఎలా కాపాడుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ నెల 24న చిత్రం విడుదల కాబోతుంది.