దేశంలో పెరుగుతున్న హెచ్ఎంపీవీ కేసులు.. ఏడుకు చేరిక
- నాగ్‌పూర్‌లో నిన్న ఇద్దరికి సోకినట్టు గుర్తింపు
- ఇప్పటికే బెంగళూరు, చెన్నై, సేలం, అహ్మదాబాద్‌లో కేసులు
- బాధితులందరూ 13 ఏళ్ల లోపు వారే
- భయం అక్కర్లేదంటున్న వైద్య నిపుణులు
హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయన్న ఆందోళన నెలకొన్నప్పటికీ ఇది ప్రాణాలు తీసేంత భయంకరమైన వైరస్ కాదని, భయపడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. దీనిని గతంలోనే పలు దేశాల్లో గుర్తించినట్టు పేర్కొన్నారు. అంతేకాదు, యాంటీ బయాటిక్స్ వాడాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేస్తున్నారు.