కొత్త ఏడాది వేళ చైనాలో కలకలం రేపుతున్న కొత్త వైరస్.. కిక్కిరిసిపోతున్న ఆసుపత్రులు
- చైనా సోషల్ మీడియాలో హోరెత్తుతున్న వార్తలు
- ‘హ్యూమన్ మెటానియా’ వైరస్ సోకి వేలాదిమంది ఆసుపత్రుల్లో చేరుతున్నట్టు ప్రచారం
- దీంతోపాటు కొవిడ్, ఇన్ఫ్ల్యూయెంజా, మైకోప్లాస్మా, నిమోనియా బారినపడుతున్న ప్రజలు
అంతేకాదు, ఈ వైరస్‌తోపాటు ఇన్ఫ్ల్యూయెంజా ఏ, మైకోప్లాస్మా, నిమోనియా, కొవిడ్-19 వైరస్లు కూడా వ్యాప్తి చెందుతున్నట్టు చెబుతున్నారు. హ్యూమన్ మెటానియా వైరస్ సోకుతున్న వారిలో కొవిడ్ లక్షణాలే కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. గుర్తు తెలియని ఓ నిమోనియా తరహా వైరస్ మూలాలు కనుగొనేందుకు చైనా వ్యాధి నియంత్రణ అథారిటీ ఓ పర్యవేక్షక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థ ఒకటి పేర్కొనడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరుస్తోంది.