ఐఎండీబీ 2024 లిస్టులో నెంబర్ వన్ గా ప్రభాస్ సినిమా

imdb most popular indian movies 2024
  • ఐఎండీబీ 2024 మోస్ట్ పాప్యులర్ సినిమా జాబితాలో అగ్ర స్థానంలో కల్కి 2898 ఏడీ 
  • ప్రతి ఏటా మోస్ట్ పాప్యులర్ విభాగంలో టాప్ పొజిషన్‌ లో  ఉన్న సినిమాల జాబితాను విడుదల చేస్తున్న ఐఎండీబీ
  • రెండో స్థానంలో నిలిచిన స్త్రీ మువీ
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా ఐఎండీబీలో అగ్ర స్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్‌ టైన్మెంట్ పోర్టల్ ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ప్రతి ఏటా దేశంలోని సినిమాల క్రేజ్ గురించి సర్వే నిర్వహించి మోస్ట్ పాప్యులర్ విభాగంలో టాప్ పొజిషన్ ఉన్న సినిమాల జాబితాను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ ఏడాది మోస్ట్ పాప్యులర్ సినిమాల జాబితాను ఐఎండీబీ విడుదల చేసింది. 

మొదటి స్థానంలో ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సినిమా నిలవగా, రెండో స్థానంలో రాజ్ కుమార్ రావు, శ్రద్దా కపూర్, పంకజ్ త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ బ్లాక్ బస్టర్ 'స్త్రీ' సినిమా  రెండో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో తమిళ నటుడు విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో వచ్చిన మహారాజ సినిమా, బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్, కోలీవుడ్ నటులు ఆర్ మాధవన్, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన తాజా సినిమా షైతాన్ నిలిచాయి. 

అలానే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ నటించిన తాజా చిత్రం ఫైటర్, మలయాళం బ్లాక్ బస్టర్ 'మంజుమ్మెల్ బాయ్స్' సినిమా, కార్తీక్ ఆర్యన్ నటించిన హారర్ కామెడీ సీక్వెల్ భూల్ భూలయ్య 3, బాలీవుడ్‌లో చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్ అందుకున్న కిల్ సినిమా, అజయ్ దేవగణ్, కరీనా కపూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా సింగం ఎగైన్, ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్‌లో వచ్చిన సినిమా లాపతా లేడీస్ టాప్ టెన్‌‌లో నిలిచాయి. 
 
Go Back to Shorts
imdb
most popular indian movies
Kalki 2898ad

More Telugu News