కోహ్లీతో వాగ్వాదంపై ఆసీస్ కొత్త ఓపెనర్ సామ్ కాన్ స్టాస్ స్పందన
- ఇద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామన్న సామ్ కాన్‌స్టాస్
- తాను గ్లవ్స్‌ను సరిచేసుకుంటూ విరాట్ వస్తున్న విషయాన్ని గమనించలేదన్న కాన్‌స్టాస్
- ఇదేమీ పెద్ద సమస్య కాదని కాన్‌స్టాస్ వెల్లడి
మరో పక్క వీరి మధ్య వివాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఘటనపై సామ్ కాన్‌స్టాస్ స్పందిస్తూ..తాము ఇద్దరం కాస్త భావోద్వేగానికి గురయ్యామని అనిపిస్తోందన్నాడు. విరాట్ వస్తున్నట్లు తాను గమనించలేదని, గ్లవ్స్‌ను సరిచేసుకునే పనిలో ఉండగా ఇది జరిగిందన్నారు. అయితే, క్రికెట్‌లో ఇలా జరుగుతూ ఉంటుందని, ఇదేమీ పెద్ద సమస్య కాదని కాన్‌స్టాస్ పేర్కొన్నాడు.