ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో 'మా' సభ్యులకు మంచు విష్ణు కీలక సూచన
- సున్నితమైన అంశాలపై ఎవరూ బహిరంగ ప్రకటన చేయవద్దన్న విష్ణు
- ఇలాంటి సమయంలో మనందరికీ సహనం, ఐక్యత అవసరమని వ్యాఖ్య
- సమస్యలను అందరం కలసికట్టుగా ఎదుర్కొందామని సూచన
ఇటీవల జరిగిన పరిణామాలను అందరూ దృష్టిలో పెట్టుకోవాలని... 'మా' సభ్యులందరూ సున్నితమైన అంశాలపై వ్యక్తిగత అభిప్రాయాలను బహిరంగంగా ప్రకటించడం మానుకోవాలని విష్ణు సూచించారు. కొన్ని సమస్యలు వ్యక్తిగతమైతే, మరికొన్ని విషాదకరమైనవని చెప్పారు. అలాంటి అంశాలపై మాట్లాడటం వల్ల అది సమస్యను పరిష్కరించడానికి బదులు... సంబంధిత పక్షాలకు మరింత నష్టం చేకూర్చుతుందని అన్నారు. ఇలాంటి సమయంలో మనందరికీ సహనం, ఐక్యత, సానుభూతి అవసరమని చెప్పారు. ఏ సమస్య వచ్చినా అందరం కలసికట్టుగా ఎదుర్కొందామని అన్నారు.