తన తండ్రి వైఎస్ కు నివాళి అర్పించిన జగన్
- బెంగళూరు నుంచి ఇడుపులపాయకు చేరుకున్న జగన్
- ఎస్టేట్ లో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న జగన్
- మధ్యాహ్నం 3.30 గంటలకు పులివెందులకు బయల్దేరనున్న వైసీపీ అధినేత
కాసేపట్లో ఆయన కడప నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఆయన ఇడుపులపాయ నుంచి పులివెందులకు బయల్దేరుతారు. పులివెందులలోని నివాసంలో బస చేస్తారు. 27వ తేదీ ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్ లో జరిగే వివాహానికి హాజరవుతారు. ఆ తర్వాత పులివెందుల నుంచి బెంగళూరుకు తిరుగుపయనమవుతారు.