ఆ ప్రచారం నిరాధారం.. టాటా గ్రూప్ కీలక ప్రకటన
- ‘స్టార్‌బక్స్’ భారత్ నుంచి నిష్క్రమించడం లేదు
- నిరాధార ప్రచారం జరుగుతోంది
- ఊహాగానాలను ఖండించిన టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్
- 2012 నుంచి భారత్‌లో ఇరు కంపెనీల జాయింట్ వెంచర్
కాగా, అధిక నిర్వహణ వ్యయాలు, తక్కువ లాభాల కారణంగా భారత్‌లో స్టార్‌బక్స్ తన కార్యకలాపాలను మూసివేయవచ్చంటూ ప్రచారం జరుగుతోంది. ‘ధర ఎక్కువ, రుచి తక్కువ, అందుకే నష్టాలు పెరుగుతున్నాయి’ అంటూ కథనాలు వెలువడుతున్నాయి. దీంతో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ రంగంలోకి దిగి ప్రకటన చేసింది.
టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్‌తో జాయింట్ వెంచర్ ద్వారా అక్టోబర్ 2012లో స్టార్‌బక్స్ భారత్‌లో తన వ్యాపారాన్ని మొదలుపెట్టింది.