వందసార్లకు పైగా ఢిల్లీకి వెళ్లారు... రూపాయి ప్రయోజనం కూడా లేదు: కేటీఆర్
- అసెంబ్లీలో ఢిల్లీ టూరిజం, జైల్ టూరిజంపై చర్చించాలన్న కేటీఆర్
- 40 మంది కొడంగల్ రైతులను జైలుకు పంపారని మండిపాటు
- సినీ నటులను జైలుకు పంపించారని ఆగ్రహం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరగనున్న నేపథ్యంలో... రెండు అంశాలపై తప్పకుండా చర్చించాలని కేటీఆర్ చెప్పారు. అందులో ఒకటి ఢిల్లీ టూరిజం, రెండోది జైల్ టూరిజం అని ఎద్దేవా చేశారు. ఈ రెండు అంశాల్లో రేవంత్ ప్రభుత్వం ఎంతో ప్రగతి సాధించిందని సెటైర్ వేశారు.
జైలు టూరిజంలో భాగంగా 40 మంది కొడంగల్ రైతులను జైలుపాలు చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సినీ నటులను జైలుకు పంపించారని... బెయిల్ వచ్చినా వారిని విడుదల చేయలేదని విమర్శించారు. సోషల్ మీడియా వారియర్లను జైలుకు పంపారని అన్నారు. ఎల్ అండ్ టీ సీఎఫ్ఓను జైలుకు పంపుతామని బెదిరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.