సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో అల్లు అర్జున్‌ అరెస్ట్‌ వీడియో!

      
ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో ఈ నెల‌ 4న రాత్రి 'పుష్ప-2: ది రూల్' ప్రీమియ‌ర్‌ షో కోసం అల్లు అర్జున్ రాకతో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ్‌ (9)కు గాయాలైన విషయం తెలిసిందే. ప్ర‌స్తుతం శ్రీతేజ్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. అత‌ని పరిస్థితి విషమంగా ఉన్నట్టు స‌మాచారం.

ఇక మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు బ‌న్నీపై ఇప్పటికే నమోదు చేశారు. ఆయ‌న‌పై పోలీసులు బీఎన్ఎస్ 105, 118 సెక్ష‌న్ల కింద కేసు న‌మోదు చేశారు. తాజాగా ఈ కేసులో చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్ ఇంటికెళ్లి ఆయ‌న్ను అదుపులోకి తీసుకున్నారు. అనంత‌రం చిక్కడపల్లి పీఎస్‌కు త‌ర‌లించారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్ప‌టికే సెక్యూరిటీ గార్డ్‌ సహా థియేటర్‌ యజమాన్యానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. 


More Telugu News