Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయి దుర్గా తేజ్ 'ఎస్‌వైజీ' గ్లింప్స్ అదుర్స్‌..!

Sai Durga Tej SYG Movie Glimpse goes Viral
Advertisement
  • సాయి దుర్గా తేజ్, కొత్త దర్శకుడు రోహిత్ కేపీ కాంబోలో ‘ఎస్‌వైజీ’ 
  • క్యాప్షన్‌గా ‘సంబరాల ఏటి గట్టు’ 
  • సినిమా గ్లింప్స్‌ను విడుద‌ల చేసిన రామ్‌చ‌ర‌ణ్
  • 2025 సెప్టెంబర్ 25న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న మూవీ
Advertisement
మెగా ఫ్యామిలీ హీరో సాయి దుర్గా తేజ్, కొత్త దర్శకుడు రోహిత్ కేపీ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే. 'ఎస్‌డీటీ18' అనే వర్కింగ్ టైటిల్ మీద లాంచ్ అయిన ఈ సినిమాకు తాజాగా ‘ఎస్‌వైజీ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ‘సంబరాల ఏటి గట్టు’ అనేది క్యాప్షన్‌గా పెట్టారు. ఈ సినిమా గ్లింప్స్, టైటిల్, విడుద‌ల తేదీల‌ను ఒకేసారి విడుదల చేశారు. 

‘ఎస్‌వైజీ’ కార్నేజ్ పేరిట ఈ గ్లింప్స్‌ను గురువారం నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో గ్లోబ‌ల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ విడుద‌ల చేశారు. ఈ గ్లింప్స్‌లో సాయి క్యారెక్టర్‌ను చాలా ప‌వ‌ర్‌ఫుల్‌గా చూపించారు. నరికేసిన చెట్టు మొద్దు మీద మాసీగా కూర్చున్న హీరోను గ్లింప్స్‌లో చూడొచ్చు. ఆ తర్వాత తన మీదకు వస్తున్న రౌడీలపై విరుచుకుపడి చంపడం చూపించారు. చివర‌లో సాయి దుర్గా తేజ్ చాలా పవర్‌ఫుల్‌గా రాయలసీమ యాసలో డైలాగులు చెప్పడం ఉంది. మొత్తంగా ఈ గ్లింప్స్ అదుర్స్ అనే చెప్పాలి. ఫిజికల్‌గా కూడా సాయి చాలా మేకోవర్ అయ్యారు. 

సంగీత దర్శకుడు అజనీశ్‌ లోక్‌నాథ్ కూడా అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ను అందించారు. ‘ఎస్‌వైజీ’లో సాయి దుర్గా తేజ్‌కు జంటగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తున్నారు. జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 
Advertisement
Advertisement
Sai Durga Tej
SYG Movie
Ramcharan
Tollywood

More Telugu News