ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటీటీకి మలయాళ బ్లాక్ బస్టర్!

Bougainvillea Movie OTT Release Date Confirmed
  • మలయాళంలో రూపొందిన సినిమా
  • సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ   
  • అక్కడ 35 కోట్లు రాబట్టిన కంటెంట్ 
  • ఈ నెల 13 నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్

మలయాళ ఇండస్ట్రీకి ఈ ఏడాది బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. ఈ ఏడాది ఆరంభం నుంచే భారీ విజయాలు నమోదు కావడం మొదలైంది. అప్పటి నుంచి వరుసగా మలయాళ ఇండస్ట్రీని భారీ విజయాలు పలకరిస్తూనే వస్తున్నాయి. రీసెంటుగా ఆ జాబితాలోకి 'బోగన్ విల్లియా' చేరిపోయింది. అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, అక్టోబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. 

'రుతింతే' అనే నవల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. కుంచకో బోబన్ .. ఫహాద్ ఫాజిల్ .. జ్యోతిర్మయి ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, అక్కడ 35 కోట్ల వరకూ వసూలు చేసింది. అలాంటి ఈ సినిమా త్వరలో ఓటీటీ ప్రేక్షకులను పలకరించనుంది. ఈ నెల 13వ తేదీన నుంచి  ఈ సినిమా, మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషల్లో 'సోనీ లివ్'లో స్ట్రీమింగ్ కానుంది. 

కథ విషయానికి వస్తే, రాయిస్ (కుంచకో బోబన్) రీతూ ( జ్యోతిర్మయి) భార్యాభర్తలు. ఇద్దరు పిల్లలతో వారి జీవితం హ్యాపీగా గడిచిపోతూ ఉంటుంది. ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన రీతూ గతాన్ని మరిచిపోతుంది. ఆమెను మామూలు మనిషిని చేయడానికి భర్త ప్రయత్నిస్తూ ఉంటాడు. కేరళకు వచ్చిన పర్యాటకులలో కొందరు మిస్సవుతుంటారు. ఆ మిస్టరీని ఛేదించడానికి ఏసీపీ డేవిడ్ (ఫహద్ ఫాజిల్) రంగంలోకి దిగుతాడు. జరుగుతున్న సంఘటనలకు రీతూ కారణమనేలా అతనికి ఆధారాలు లభిస్తాయి. ఏది నిజం? ఎవరు కారణం? అనేది కథ. 

Advertisement
Fahadh Faasil
Kunchacko Boban
Jyothirmayi
Bougainvillea

More Telugu News