Prabhas: 17 ఏళ్ల తర్వాత ఆడిపాడనున్న ప్రభాస్, నయనతార?

Nayanathara to appear in Prabhas song
షార్ట్స్‌లో చూడండి
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు మారుతి కాంబినేషన్లో 'ది రాజా సాబ్' సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మితమవుతున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు ఈ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్నారు. ఈ చిత్రం వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ప్రభాస్ తో కలిసి నయనతార ఒక ప్రత్యేక పాటలో ఆడిపాడనున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరిపారని...ఆమె ఓకే చెప్పారని తెలిసింది. ఈ నెలాఖరులో పాటను చిత్రీకరించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

మరోవైపు, 2007లో వచ్చిన 'యోగి' సినిమాలో ప్రభాస్, నయనతార జంటగా నటించారు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాలేదు. అంతా కుదిరితే వీరిద్దరూ 17 ఏళ్ల తర్వాత స్క్రీన్ ను షేర్ చేసుకోవడం జరుగుతుంది.
Go Back to Shorts
Prabhas
Nayanthara
The Raja Saag Movies

More Telugu News