Hero Vida V2: మూడు వేరియంట్లలో ‘విడా వీ2‘.. మెరుగైన ఫీచర్లతో టీవీఎస్, బజాజ్ చేతక్‌కు గట్టి పోటీ!

Hero Vida V2 Scooters Launched Here Is Key Features
షార్ట్స్‌లో చూడండి
ప్రముఖ వాహన తయారీ సంస్థ హీరో నుంచి తొలి ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చేసింది. ‘విడా వీ2’ పేరుతో వీ2 లైట్, వీ2 ప్లస్, వీ2 ప్రొ అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి తెచ్చింది.  వీ2 లైట్ మోడల్ ధర రూ. 96 వేలు కాగా, దీని రేంజ్ 94 కిలోమీటర్లు. వీ2 ప్లస్ మోడల్ ధర రూ. 1.15 లక్షలు. దీని రేంజ్ 143 కిలోమీటర్లు. ఇక హైఎండ్ మోడల్ అయిన వీ2 ప్రొ మోడల్ ధర రూ. 1.35 లక్షలు. ఒకసారి చార్జ్ చేసి ఏకంగా 165 కిలోమీటర్లు వెళ్లి రావొచ్చు.

రిమూవబుల్ బ్యాటరీ సదుపాయం ఉంది. ఆరు గంటల్లో 80 శాతం చార్జింగ్ అవుతుంది. స్కూటర్ గరిష్ఠ వేగం గంటకు 90 కిలోమీటర్లు. ఒకసారి చార్జింగ్ చేస్తే 165 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే.. కీలెస్ ఎంట్రీ, క్రూయిజ్ కంట్రోల్ సిస్టం, కస్టమ్ రైడింగ్ మోడ్ వంటివి ఉన్నాయి. వీ2 లైట్ మోడల్‌లో రెండు రైడింగ్ మోడ్స్ రైడ్, ఎకో ఉండగా, వీ2 ప్లస్‌, వీ2 ప్రొలో నాలుగు మోడ్స్.. ఎకో, రైడ్, స్పోర్ట్, కస్టమ్ ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న టవీఎస్ ఐక్యూబ్ 2.2, బజాజ్ చేతక్ 290, ఎంపేర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్లకు ‘విడా వీ2’ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది. 
Go Back to Shorts
Hero Vida V2
Hero Electric Scooter
Vida V2 Lite
V2 Plus
V2 Pro
Business News

More Telugu News