ఘనంగా నాగచైతన్య-శోభిత వివాహం.. ఫోటోలు ఇవిగో

  • అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో పెళ్లి
  • హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన వివాహం
  • సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖుల హాజరు
సినీ నటుడు నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటయ్యారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక మండపంలో బుధవారం రాత్రి వీరి వివాహం ఘనంగా జరిగింది.

హిందూ సంప్రదాయ పద్ధతిలో జరిగిన ఈ వివాహానికి పలువురు సినీ, రాజకీయ, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అర్ధరాత్రి వరకు పెళ్లికి సంబంధించిన క్రతువులు జరగనున్నాయి.

చైతన్య, శోభిత నిశ్చితార్థం ఆగస్ట్‌లో జరిగింది. శోభిత ధూళిపాళ్ల 2013లో ఫెమినా మిస్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. 2016లో సినీ రంగంలోకి ప్రవేశించారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు హాలీవుడ్‌లోనూ నటిస్తున్నారు.


   


More Telugu News