Australia: సోషల్ మీడియా అంశంలో ప్రపంచ దేశాలు మమ్మల్ని అనుసరించాలి: ఆస్ట్రేలియా

Australia Says World Should Follow its Social Media Policies
  • 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియాలో చట్టం
  • డిసెంబర్ 10వ తేదీ నుంచి అమలు కానున్న చట్టం
  • తాము తీసుకుంటున్న చర్యలు ప్రపంచ దేశాలు అనుసరించాలని సూచన
16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగించకుండా ఆస్ట్రేలియా ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. డిసెంబర్ 10వ తేదీ నుంచి దీనిని అమలు చేయనుంది. దీనితో గడువుకు ముందే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైన సోషల్ మీడియాల్లో అక్కడి పిల్లలను మెటా బ్లాక్ చేస్తోంది.

తమ నిర్ణయంపై ఆస్ట్రేలియా ఇంటర్నెట్ రెగ్యులేటరీ స్పందిస్తూ, పిల్లలను సోషల్ మీడియా యాప్‌లకు దూరంగా ఉంచేందుకు తాము తీసుకుంటున్న చర్యలను ప్రపంచ దేశాలు అనుసరించాలని సూచించింది.

పదహారేళ్ల లోపు పిల్లలను సోషల్ మీడియాకు దూరంగా ఉంచాలనే నిర్ణయం గురించి మొదట తాను ఆందోళన చెందానని, కానీ ఈ విధానాన్ని చాలామంది తల్లిదండ్రులు స్వాగతిస్తుండటంతో తన ఆలోచనను మార్చుకున్నానని ఇ-సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ పేర్కొన్నారు. దేశంలోని పిల్లలపై సోషల్ మీడియా బ్యాన్ విధించడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయని, ఈ విషయంలో అన్ని దేశాలకు ఆస్ట్రేలియా ఉదాహరణగా నిలుస్తుందని అన్నారు.

పిల్లల ఖాతాలను బ్లాక్ చేస్తున్న నేపథ్యంలో అందులోని వారి ఫొటోలు, ఇతర డేటాను డౌన్‌లోడ్ చేసుకోవాలని సోషల్ మీడియా సంస్థలు వారికి సూచిస్తున్నాయి. పదహారేళ్ల కన్నా తక్కువ వయస్సు ఉన్నవారు సోషల్ మీడియాను వాడకుండా నిషేధిస్తూ చేసిన చట్టం వల్ల వేలాదిమంది టీనేజర్ల సామాజిక మాధ్యమ ఖాతాలు ప్రభావితం కానున్నాయి. ఈ నిర్ణయంపై కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం మాత్రం ఈ చట్టాన్ని అమలు చేస్తామని చెబుతోంది.
Australia
Social Media Ban
Children
Julie Inman Grant
E-safety Commissioner
Facebook

More Telugu News