రాంగోపాల్ వర్మ హీరోగా 'షో మ్యాన్'... విలన్ గా సుమన్

Ram Gopal Varma as Hero in Show Man with Suman as Villain
  • షో మ్యాన్' చిత్రంలో టైటిల్ రోల్ పోషిస్తున్న ఆర్జీవీ
  • ప్రతినాయకుడి పాత్రలో సీనియర్ నటుడు సుమన్
  • గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా
  • సంక్రాంతికి ట్రైలర్ విడుదల చేయనున్నట్లు నిర్మాత వెల్లడి
విలక్షణ దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇప్పుడు నటుడిగా పూర్తిస్థాయి ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రానికి 'షో మ్యాన్' అనే పేరు ఖరారు చేశారు. 'మ్యాడ్ మాన్ స్టర్' అనేది ఈ సినిమాకు ట్యాగ్‌లైన్. ఈ చిత్రంలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటం గమనార్హం. గతంలో రజినీకాంత్ 'శివాజీ' చిత్రంలో సుమన్ పోషించిన విలన్ పాత్ర ఎంతగా ఆకట్టుకుందో తెలిసిందే.

'నూతన్' అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ఆర్జీవీతో గతంలో 'ఐస్ క్రీమ్-1, ఐస్ క్రీమ్-2' వంటి చిత్రాలు నిర్మించిన తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భీమవరం టాకీస్ పతాకంపై ఓ ప్రముఖ కార్పొరేట్ సంస్థతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

రాంగోపాల్ వర్మకు అత్యంత ఇష్టమైన గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ చిత్రం షూటింగ్ నిరాడంబరంగా ప్రారంభమైంది. రాబోయే సంక్రాంతి పండుగకు సినిమా ట్రైలర్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తెలిపారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్‌ప్లే కూడా దర్శకుడు నూతన్ అందిస్తున్నారు.
Go Back to Shorts
Ram Gopal Varma
Show Man
RGV
Suman
Gangster Movie
Telugu Cinema
Tollywood
Bheemavaram Talkies
Nutan
Thummalapalli Rama Satyanarayana

More Telugu News