India South Africa T20: భారత్, దక్షిణాఫ్రికా మ్యాచ్.. కటక్‌లో టిక్కెట్ల కోసం వేకువజాము నుంచే ఎగబడ్డ అభిమానులు

India South Africa T20 Tickets Cuttack Fans Queue From Dawn
  • డిసెంబర్ 9న కటక్ వేదికగా టీ20 మ్యాచ్
  • ఆఫ్‌లైన్ టిక్కెట్ల కోసం వేలాదిగా తరలి వచ్చిన అభిమానులు
  • తక్కువ సంఖ్యలో ఆఫ్‌లైన్‌లో టిక్కెట్లు ఉంచడంతో సమస్య
కటక్‌లోని బారాబతి స్టేడియంలో డిసెంబర్ 9న జరగనున్న భారత్, దక్షిణాఫ్రికా టీ20 మ్యాచ్ కోసం ఆఫ్‌లైన్ టిక్కెట్ల అమ్మకాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. మ్యాచ్ టిక్కెట్ల కోసం వేలాది మంది క్రికెట్ అభిమానులు, యువకులు వేకువజాము నుంచి టిక్కెట్ కౌంటర్ల వద్ద బారులు తీరారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ తక్కువ సంఖ్యలో టిక్కెట్లను ఆఫ్‌లైన్‌లో ఉంచగా, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.

టిక్కెట్ కౌంటర్లు తెరుచుకోకముందే వేకువజాము నుంచి మైదానం వెలుపల అభిమానులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. మారుమూల ప్రాంతాలు నుంచి, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు తరలివచ్చారు. కౌంటర్లు తెరుచుకున్న వెంటనే టిక్కెట్ల కోసం ఎగబడ్డారు. క్రికెట్ అసోసియేషన్ ఎక్కువ సంఖ్యలో టిక్కెట్లను వారి సభ్యులకు, వీఐపీలకు కేటాయించి, తక్కువ టిక్కెట్లను మాత్రమే కౌంటర్లలో విక్రయిస్తోందంటూ విమర్శలు వస్తున్నాయి.

మ్యాచ్ టిక్కెట్ ధరలు రూ.700 నుంచి రూ.20,000 మధ్య ఉన్నాయి. 

ఇక, దక్షిణాఫ్రికా, భారత్ మధ్య టీ20 మ్యాచ్‌లు కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరగనున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ 2026 సన్నాహకాల్లో భాగంగా ఈ సిరీస్ ఇరు జట్లకు కీలకం కానుంది.
India South Africa T20
India vs South Africa
Barabati Stadium
Cuttack

More Telugu News