ఈ ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో అస్సలు పెట్టొద్దు తెలుసా?

03-12-2024 Tue 18:09 | Health
Advertisement
  • కూరగాయల నుంచి మిగిలిన వంటల దాకా అన్ని ఫ్రిడ్జ్ లో పెట్టడం సాధారణమే...!
  • అలా చేస్తే కొన్ని రకాల ఆహారం రుచిని, నాణ్యతను కోల్పోతుందంటున్న నిపుణులు
  • కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల ఫంగస్ పెరుగుతుందని వెల్లడి
Advertisement
ఇంటికి తెచ్చిన కూరగాయల నుంచి... వండిన ఆహార పదార్థాల దాకా ఏది ఉన్నా, మిగిలినా వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేస్తుంటాం. అందులో పెడితే ఎక్కువ సమయం తాజాగా ఉంటాయనో, చెడిపోకుంటా ఉంటాయనో భావిస్తుంటాం. ఇది చాలా వరకు నిజమే అయినా... కొన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దానివల్ల ఆ ఆహారం నాణ్యత దెబ్బతింటుందని... రుచి తగ్గిపోతుందని, కొన్నిసార్లు ఇబ్బందులు కూడా రావొచ్చని హెచ్చరిస్తున్నారు.
బంగాళదుంపలు... 
ఆలు గడ్డలను శీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసినప్పుడు వాటిలోని పిండి (Starches) పదార్థాలు చక్కెరలు (Sugars)గా మారిపోతాయని... ఇది బంగాళ దుంపల రుచి, నాణ్యతను తగ్గించేస్తుందని నిపుణులు చెబుతున్నారు. పైగా షుగర్స్ పెరిగిన ఆహారం కూడా ఆరోగ్యానికి మంచిది కాదని స్పష్టం చేస్తున్నారు.
టమాటాలు...
టమాటాలను అతి శీతల ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేస్తే... వాటి టెక్స్ఛర్ దెబ్బతింటుంది. ఫ్లేవర్ చెడిపోతుంది. అందువల్ల టమాటాలను కాస్త కాయలుగా ఉన్నవే తెచ్చుకుని... సాధారణంగా నిల్వ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పళ్లుగా మారినకొద్దీ వినియోగించుకోవచ్చని చెబుతున్నారు.
ఉల్లిపాయలు...
ఫ్రిడ్జ్ లో శీతల ఉష్ణోగ్రతలో నిల్వ చేస్తే... ఉల్లిపాయలు బూజు పడతాయని, మెత్తబడిపోయి దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు. పొడిగా, కాస్త చల్లగా ఉండి... బాగా గాలి ఆడే ప్రదేశంలో ఉల్లిపాయలను నిల్వ చేయాలని సూచిస్తున్నారు.
అరటి పళ్లు...
అరటి పళ్లను ఎప్పుడూ ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని నిపుణులు చెబుతున్నార. దానివల్ల అరటిలోని కణ నిర్మాణం మారిపోయి, దాని రుచి, నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. సాధారణంగా బయటే... కాస్త జాగ్రత్తగా నిల్వ చేసుకోవాలని సూచిస్తున్నారు.
బ్రెడ్...
బ్రెడ్ ను ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల వేగంగా దెబ్బతింటుందని... ఫంగస్ పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. వెలుతురు పడని, కాస్త చల్లగా ఉండే ప్రదేశంలో పెడితే చాలని వివరిస్తున్నారు.
  • తేనెను ఎట్టి పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ లో పెట్టవద్దని నిపుణులు చెబుతున్నారు. దానివల్ల తేనె గట్టిపడి, చక్కెరలు విడివడి దాని సహజ లక్షణాలు పోతాయని స్పష్టం చేస్తున్నారు.
  • వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో నిల్వ చేయడం వల్ల రబ్బర్ లా సాగిపోయే తరహాలోకి మారి రుచి తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
  • అవకాడోలను ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటి కణజాలం గట్టిగా అయిపోయి తినడానికి వీలు లేకుండా ఇబ్బందిగా మారుతుందని, వాటిని బయట ఉంచడమే మంచిదని వివరిస్తున్నారు.
Advertisement
FoodFridgeoffbeatHealthViral News

More Telugu News

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44
..more