అబద్దాలు ప్రచారం చేస్తూ బీఆర్ఎస్ నేతలు పబ్బం గడుపుకుంటున్నారు: మహేశ్ కుమార్ గౌడ్
- బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రాన్ని దివాలా తీయించారన్న మహేశ్ కుమార్ గౌడ్
- ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచన
- బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని వ్యాఖ్య
ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాల్సిన అవసరం ఉందని మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. మనం చేసిన పనులను చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని పార్టీ కేడర్ కు సూచించారు. బీఆర్ఎస్ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టాలని చెప్పారు. పదేళ్లలో బీఆర్ఎస్ చేయలేని పనులు పది నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిందని అన్నారు. మతతత్వ ప్రచారంతో బీజేపీ లబ్ధి పొందుతోందని చెప్పారు.