Eknath Shinde: మోదీ, అమిత్ షా నాతో ఫోన్ లో మాట్లాడారు: ఏక్ నాథ్ షిండే

మహారాష్ట్రలో అధికార మహాయుతి కూటమి తిరుగులేని విజయం సాధించినప్పటికీ, సీఎం పదవి ఎవరు చేపట్టాలన్నదానిపై బీజేపీ, శివసేన (షిండే వర్గం) మధ్య ఏకాభిప్రాయం కుదరడంలేదు. ఈ నేపథ్యంలో, మాజీ ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే మీడియా సమావేశం నిర్వహించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనతో ఫోన్ లో మాట్లాడారని వెల్లడించారు. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై నా అభిప్రాయం తెలుసుకున్నారు అని వివరించారు. ఏ నిర్ణయం తీసుకున్నా నాకు ఆమోదమేనని చెప్పానని తెలిపారు. 

ఇక, తన దృష్టిలో సీఎం అంటే కామన్ మ్యాన్ అని షిండే అభివర్ణించారు. నన్ను నేను ఎప్పుడూ సామాన్యుడిగానే భావిస్తా అని తెలిపారు. మహారాష్ట్ర అభివృద్ధే తనకు ప్రధానం అని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రిగా గత రెండున్నరేళ్లుగా చేసిన పనులు సంతృప్తినిచ్చాయని షిండే పేర్కొన్నారు. తాము చేపట్టిన సంక్షేమ పథకాలు చూసి ప్రజలు మళ్లీ తమకే పట్టం కట్టారని వివరించారు. తాను ఎప్పుడూ బాల్ థాకరే మార్గంలోనే పయనించానని తెలిపారు. 

కాగా, షిండేకు బీజేపీ హైకమాండ్ ఫోన్ చేయడం, అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన తీరు చూస్తే... సీఎం రేసు నుంచి తప్పుకున్నట్టే కనిపిస్తోంది.
Eknath Shinde
Chief Minister
Maharashtra
Mahayuti Alliance

More Telugu News