Game Changer: 'గేమ్ ఛేంజ‌ర్' మూడో పాట‌పై కీల‌క అప్డేట్‌.. కొత్త పోస్ట‌ర్ అదుర్స్‌!

The third single from Game Changer dropping on Nov 28th
షార్ట్స్‌లో చూడండి
గ్లోబ‌ల్ స్టార్‌ రామ్ చరణ్, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న కొత్త చిత్రం 'గేమ్ ఛేంజర్'.  ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా 2025 జనవరి 10న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుద‌లైన‌ రెండు పాటలు, టీజర్ 'గేమ్ ఛేంజర్‌'పై భారీగా అంచనాలు పెంచేశాయి. 

తాజాగా 'గేమ్ ఛేంజర్' మూడో పాటపై మేక‌ర్స్‌ అప్డేట్ ఇచ్చారు. ఈ సాంగ్‌ను ఈ నెల‌ 28న విడుద‌ల చేయబోతున్నట్టు ప్రకటించారు. దీనికి సంబంధించి ఓ కొత్త పోస్టర్ కూడా విడుద‌ల‌ చేశారు. ఇదొక ల‌వ్ ట్రాక్ అని తెలుస్తోంది. హీరోహీరోయిన్‌ చెర్రీ, కియారా అద్వానీ కలర్ ఫుల్‌గా ఉన్న ఈ పోస్టర్ సింప్లీ సూప‌ర్బ్ అని చెప్పాలి. పర్పుల్ క‌ల‌ర్ డ్రెస్‌లో ఇద్ద‌రూ అద‌ర‌గొట్టేశారు. 

ఇక ఇప్పటివరకు 'గేమ్ ఛేంజర్' నుంచి వచ్చిన రెండు సాంగ్స్ 'జ‌ర‌గండి', 'రా మ‌చ్చా'... మాస్ ఆడియన్స్ ని మెప్పించగా ఇప్పుడు మెలోడీ పాట ఏ రేంజ్‌లో మెప్పిస్తుందో చూడాలి.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌ శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్ రాజు నిర్మాణంలో భారీగా ఈ సినిమా రూపొందింది. ఎస్ఎస్ థ‌మ‌న్ బాణీలు అందించిన గేమ్ ఛేంజ‌ర్‌లో ఇత‌ర కీల‌క పాత్ర‌ల్లో అంజలి, సునీల్, సముద్రఖని, ఎస్‌జే సూర్య త‌దిత‌రులు న‌టించారు.
Go Back to Shorts
Game Changer
Ramcharan
Tollywood

More Telugu News