ఆర్టీసీ బస్సులో యువకుడి ఆత్మహత్య
- రేణిగుంట వద్ద గుర్తించిన బస్సు కండక్టర్
- ఘటన జరిగిన సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రేణిగుంట పోలీసులు
బస్సులో చివరి సీటు వద్ద హ్యాంగర్‌కు యువకుడు ఉరి వేసుకుని చనిపోయాడు. ఇది గమనించి కండక్టర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో బస్సులో ముగ్గురు ప్రయాణీకులు మాత్రమే ఉన్నారు. కండక్టర్ ఫిర్యాదు మేరకు రేణిగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అయితే మృతి చెందిన యువకుడి వివరాలు మాత్రం ఇంత వరకూ తెలియరాలేదు.